Click here to watch video on how to use and apply Nano Urea Plus & Nano DAP.

 

తరచుగా అడుగు ప్రశ్నలు

  • నానో DAP (ద్రావకం) అంటే ఏమిటి?

    నానో DAP (ద్రావకం) అనేది 2 మార్చి 2023న భారత ప్రభుత్వం FCO (1985) కింద  నానో ఎరువులు. నానో DAP సూత్రీకరణలో నత్రజని (8.0% N w/v) మరియు భాస్వరం (16.0 % P2O5 w/v) ఉన్నాయి.

  • నానో DAP (ద్రావకం) యొక్క ప్రయోజనాలు ఏమిటి?
    • నానో DAP (ద్రావకం) దేశీయ మరియు సబ్సిడీ లేని ఎరువులు
    • ఇది అన్ని పంటలకు అందుబాటులో ఉన్న నత్రజని (N) మరియు భాస్వరం (P2O5) యొక్క సమర్థవంతమైన వనరు. ఇది ప్రస్తుతం వేసిఉన్న పంటలలో నత్రజని & భాస్వరం లోపాలను సరిచేస్తుంది
    • సరైన పంటపొలం యొక్క పరిస్థితులలో పోషకాల వినియోగ సామర్థ్యం 90 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది
    • ప్రారంభ అంకురోత్పత్తి మరియు బలంకోసం  విత్తనానికి పైపూతగా ఉపయోగపడుతుంది, పంట పెరుగుదల మరియు నాణ్యతను పెంచుతుంది, పంట దిగుబడిని పెంచుతుంది.
    • ఇది సాంప్రదాయ DAP కంటే చౌకగాను మరియు రైతులకు లాభదాయకంగాను ఉంటుంది 
    • భాస్వరపు ఎరువులు అధికంగా ఉపయోగించడం వల్ల నేల, గాలి మరియు నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుంది
    • జీవ-సురక్షితమైన మరియు పర్యావరణ అనుకూలమైన, అవశేషాలు లేని వ్యవసాయానికి సరిపోతుంది
  • నానో DAP (ద్రావకం) ఎలా ఉపయోగించాలి?
    1.  విత్తన శుద్ధి:- నానో DAP @ 3-5 మి.లీ కిలో విత్తనాలకు వేయండి, అవసరమైన పరిమాణంలో నీటిలో కరిగించి విత్తన ఉపరితలంపై పలుచగా పట్టిచండి. 20-30 నిమిషాలు వదిలివేయండి; నీడతో ఆరబెట్టి, ఆపై విత్తండి.
    2. వేరు/ దుంప/ నారు శుద్ధి:- నానో DAP @ 3-5 మి.లీ లీటరు నీటికి వేయండి. నానో డిఎపి ద్రావణంలో అవసరమైన పరిమాణంలో 20-30 నిమిషాల పాటు మొలక వేరు/ దుంప/ నారును ముంచండి. నీడలో ఆరబెట్టి తర్వాత నాటుకోవాలి
    3. ఆకులపై పిచికారి:- నానో DAP @ 2-4 మి.లీ లీటరు నీటికి మంచి ఆకుల దశలో (మొలకెత్తే దశ / మారాకులు వేసే దశ)

    పుష్పించే ముందు దశలో ఒక అదనపు పిచికారి దీర్ఘకాలం మరియు అధిక భాస్వరం అవసరమయ్యే పంటలకు వేయవచ్చు.

  • నానో DAP ఆకులపై పిచికారి చేసిన తర్వాత వర్షాలు పడితే, ఏమి చేయాలి?

    ఆకులపై పిచికారీ ఉపయోగించిన 12 గంటలలోపు వర్షాలు కురిస్తే, మళ్లీ పిచికారీ చేయాలని సిఫార్సు చేయబడింది

  • మట్టి లేదా డ్రిప్ ద్వారా నానో DAPని వేయవచ్చా?

    లేదు, నానో డిఎపి (ద్రావకం) విత్తన శుద్ధి మరియు పంటల యొక్క క్లిష్టమైన ఎదుగుదల దశలలో ఆకులపై పిచికారీ కోసం మాత్రమే సిఫార్సు చేయబడింది.

  • నానో DAP (ద్రావకం) ధర ఎంత? ఇది సంప్రదాయ DAP కంటే ఎక్కువగా ఉందా?

    ఒక్కో బాటిల్‌కు రూ.600 (500 మి.లీ.); ఇది సంప్రదాయ DAP కంటే చౌకగా ఉంటుంది.

  • నానో DAP (ద్రావకం) ఉపయోగించు విధాన పట్టిక ఏమిటి?

     పంటలు

     

    నానో DAP

    విత్తన / మొలకల శుద్ధి

    నానో DAP పిచికారి @ 2-4 మి.లీ. / లీటరు

    ధాన్యాలు

    (గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, మినుములు, వరి మొదలైనవి.

    3-5 మి.లీ. / కె.జి. విత్తనాలకు లేదా

    @ 3- 5 మి.లీ./లీటరు నీటిలో మొలకల వేర్లు ముంచాలి
    మారాకు వేయు దశ (30-35 DAG లేదా 20-25 DAT)

    పప్పులు

    (శెనగ, కంది, మసూర్ దాల్, పెసర, మినప మొదలైనవి)
    3-5 మి.లీ. / కె.జి. విత్తనాలకు శాఖల దశ  (30-35 DAG)

    నూనెగింజలు

    (ఆవాలు, వేరుశెనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు మొదలైనవి)
    3-5 మి.లీ. / కె.జి. లీటర్ నీటికి శాఖల దశ (30-35 DAG)

    కూరగాయలు

    (బంగాళదుంప, ఉల్లిపాయ, వెల్లుల్లి, బఠానీ, బీన్స్, కాబేజి పంటలు మొదలైనవి).

    సేరుగా విత్తనానికి : 3-5 మి.లీ. / కేజీ విత్తనాలకు;

    నాటిన మొలకల వేర్లు @ 3- 5 మి.లీ./ లీటరు నీరు

    శాఖల దశ (30-35 DAG)

    మార్పిడి

    (20-25 DAT)

    పత్తి 3-5 మి.లీ. / కె.జి. విత్తనాలకు శాఖల దశ (30-35 DAG)
    చెరకు -5 మి.లీ. / లీటరు నీరు మారాకు వేయు దశ ప్రారంభంలో (నాటిన తర్వాత 45-60 రోజులకు)

     

    DAG: అంకురోత్పత్తి తర్వాత రోజులు DAT: మార్పిడి తర్వాత రోజులు

  • నానో DAP (ద్రావకం) ప్యాకింగ్ పరిమాణం ఎంత?

    500 మి.లీ.

  • నాకు నానో DAP (ద్రావకం) ఎక్కడ దొరుకుతుంది?

    నానో DAP (ద్రావకం) IFFCO సభ్య సహకార సంఘాలు, (PACS), ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు (PMKSKలు), రైతు సేవా కేంద్రాలు: IFFCO బజార్ కేంద్రాలు మరియు చిల్లర దుకాణాలలో అందుబాటులో ఉంది. ఇప్పుడు రైతులు www.iffcobazar.in నుండి ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేయవచ్చు.

సహాయం కావాలి

1800 103 1967
nanodap@iffco.in
సోమవారం - శనివారం
ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు
IFFCO Business Enquiry